Dilsukhnagar Bomb Blast | దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు..!
Dilsukhnagar Bomb Blast | దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
Dilsukhnagar Bomb Blast | దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ఎన్ఐఏ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 2016లో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే, కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అయితే, ఈ శిక్షను సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. మంగళవారం తుది తీర్పు ఇవ్వనున్నది. కోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందో తనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
21న ఫిబ్రవరి 2013లో దిల్సుఖ్నగర్ పేలుళ్లు సంభవించాయి. ఎన్ఐఏ రంగంలోకి దిగి విచారణ జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఈ ఘటనలో ఇండియన్ ముజాహిద్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది. నిందుల్లో అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్ను 2013లో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

