రూ.కోటి విరాళమిస్తేనే టికెట్ ధరల పెంపు!
రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు, థియేటర్ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలతో బుధవారం జీవో జారీ చేసింది. కొత్తగా ‘స్పెషల్ థియేటర్స్' క్యాటగిరీని ఏర్పాటు చేయడంతోపాటు అన్ని థియేటర్లలో ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట వరకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. వాటిలో ఒక షోను చిన్న సినిమాలకు కేటాయింంచింది.
- రూ.100 కోట్లతో తీస్తే ‘సూపర్ హై బడ్జెట్’ సినిమా
- థియేటర్ స్థాయిని బట్టి టికెట్ ధర
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు, థియేటర్ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలతో బుధవారం జీవో జారీ చేసింది. కొత్తగా ‘స్పెషల్ థియేటర్స్’ క్యాటగిరీని ఏర్పాటు చేయడంతోపాటు అన్ని థియేటర్లలో ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట వరకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. వాటిలో ఒక షోను చిన్న సినిమాలకు కేటాయింంచింది.
‘సినీ కార్మిక సంక్షేమ నిధి’కి రూ.1 కోటి విరాళం ఇచ్చే చిత్రాలకే టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇస్తామని స్పష్టం చేసింది. 7.1 సౌండ్ సిస్టమ్, 2కే లేదా 4కే స్రీన్ ఉన్న థియేటర్లను ‘స్పెషల్ థియేటర్స్’ క్యాటగిరీలో చేర్చింది. ప్రేక్షకులపై అధిక భారం పడకుండా చూసేందుకు ప్రతి థియేటర్లో కనీసం 25% సీట్లను నాన్-ప్రీమియం క్యాటగిరీలో ఉంచాలని పేర్కొన్నది.
టికెట్ ధరలపై పరిమితులు
సింగిల్ స్రీన్, ఏసీ, నాన్-ఏసీ, స్పెషల్ థియేటర్లకు ప్రభుత్వం వేర్వేరు టికెట్ ధరలను నిర్ణయించింది. నాన్-ఏసీ థియేటర్లలో నాన్-ప్రీమియం టికెట్ ధర రూ.30 నుంచి రూ.70 వరకు, ప్రీమియం టికెట్ ధర రూ.50 నుంచి రూ.100 వరకు ఉండేలా పరిమితులు విధించింది. ఏసీ థియేటర్లలో నాన్-ప్రీమియం టికెట్ ధర రూ.50 నుంచి రూ.150, ప్రీమియం టికెట్ ధర రూ.100 నుంచి రూ.200 వరకు ఉండాలని నిర్ణయించింది.
స్పెషల్ థియేటర్లలో నాన్-ప్రీమియం టికెట్ ధర రూ.100 నుంచి రూ.250 వరకు ఉండాలని పేర్కొన్నది. రూ.100 కోట్లకుపైగా బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలకు ‘సూపర్ హై బడ్జెట్’ హోదా కల్పిస్తున్నట్టు పేర్కొన్నది. ఇలాంటి చిత్రాలకు మొదటి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

