TS DSC | గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. 5089 టీచర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని పోస్టులతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు.. మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.