కేసీఆర్‌ను ఓడగొట్టి సర్వనాశనమైనం!
కేసీఆర్‌ను ఓడగొట్టి సర్వనాశనం అయితానం.. కాంగ్రెస్‌కు ఓటేసినందుకు చెంపలు వేసుకుంటున్నా.. అంటూ వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన రైతు కసిరబోయిన లచ్చయ్య భావోద్వేగానికి గురయ్యాడు.
- కాంగ్రెస్‌కు ఓటేసినందుకు చెంపలేసుకుంటున్న!
- మళ్లీ సారే రావాలె… మీరు ఎమ్మెల్యేగా గెలువాలె
- ఎర్రబెల్లితో గోడు వెళ్లబోసుకున్న రైతు లచ్చయ్య
రాయపర్తి, నవంబర్ 2 : కేసీఆర్‌ను ఓడగొట్టి సర్వనాశనం అయితానం.. కాంగ్రెస్‌కు ఓటేసినందుకు చెంపలు వేసుకుంటున్నా.. అంటూ వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన రైతు కసిరబోయిన లచ్చయ్య భావోద్వేగానికి గురయ్యాడు. సోమవారం రాయపర్తి మండల కేంద్రంలో పట్టభద్రుల ఓటు నమోదుపై అవగాహన కల్పించేందుకు ఇంటింటికీ పార్టీ శ్రేణులతో కలిసి కాలినడకన తిరుగుతున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును చూసిన రైతు లచ్చయ్య తనగోడు వెళ్లబోసుకున్నాడు.
ఎర్రబెల్లి: యాసంగిల పంటలు పండుతయా…?
లచ్చయ్య: కాంగ్రెస్ పోందీ… పంటలు పండయి. నీళ్లు రావు
ఎర్రబెల్లి : కరెంట్ వస్తున్నదా…?
లచ్చయ్య : కరెంట్ లేదు, సర్వనాశనం అయితానం.
ఎర్రబెల్లి: మరీ నన్నూ, కేసీఆర్‌ను ఓడగొట్టిండ్లు కదా….?
లచ్చయ్య : ఏం చేయాలే.. కాంగ్రెస్‌కు ఓటేసినందుకు తప్పయింది. ఇగో రెండు చెంపలు వేసుకుంటున్నా .. ఇగ జన్మల కాంగ్రెస్‌కు ఓటేయం అంటూ ఎర్రబెల్లికి దండం పెట్టాడు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలే… మీరు మళ్లా ఎమ్మెల్యేగా రావాలే సారూ అంటూ రైతు లచ్చయ్య-రజిత దంపతులు తమ మనసులోని మాటను వెలిబుచ్చాడు.
ఈ సందర్బంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడొద్దు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే పోతుంది.. కరువొచ్చిందని ఆగం కాకండి.. పెద్ద సారు కేసీఆర్, గులాబీ జెండా మీకు అండగా ఉండి కాపాడుకుంటది అంటూ ధైర్యం కల్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

