బీ క్యాటగిరీ సీట్లకు డిమాండ్ అంతంతే!
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లే కాదు, బీ క్యాటగిరీ (మేనేజ్మెంట్ కోటా) సీట్లు కూడా పూర్తిగా నిండటం లేదు.
- ఇంజినీరింగ్ యాజమాన్య కోటాలో భర్తీ అయిన సీట్లు 73 శాతమే
- ఈ ఏడాది భర్తీకాని సీట్లు 9,529
- సీఎస్ఈ కోర్సుల్లో ఖాళీలు 6,380
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లే కాదు, బీ క్యాటగిరీ (మేనేజ్మెంట్ కోటా) సీట్లు కూడా పూర్తిగా నిండటం లేదు. ఈ విద్యా సంవత్సరం బీటెక్ కాలేజీల్లో బీ క్యాటగిరీ సీట్లు 73 శాతమే భర్తీ అయ్యాయి.
మరో 27% సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2026-27 విద్యా సంవత్సరంలో మొత్తం 34,558 సీట్లు బీ క్యాటగిరీలో అందుబాటులో ఉండగా, అక్టోబర్ 13 నాటికి 25,029 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 9,529 సీట్లు ఖాళీగా ఉన్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇంజినీరింగ్ కోర్సుల్లో మొత్తం 1,20,437 సీట్లున్నాయి. కన్వీనర్ కోటాలో 85,879 సీట్లుండగా, బీ క్యాటగిరీలో 34,558 సీట్లున్నాయి. అయితే, టాప్-20 కాలేజీల్లోనే సీఎస్ఈ బీ క్యాటగిరీ సీట్లకు డిమాండ్ కనిపిస్తున్నది. మిగతా కాలేజీల్లో డిమాండ్ పెద్దగా లేదు. ఈ నేపథ్యంలోనే సీట్లు భారీగా మిగిలిపోయాయని భావిస్తున్నారు.
సీఎస్ఈలోనూ..
రాష్ట్రంలో అంతో ఇంతో డిమాండ్ ఉన్న కోర్సు ఏదైనా ఉన్నదంటే అది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)నే. అయితే ఈ కోర్సులోని యాజమాన్య కోటాలోని సీట్లు మొత్తం నిండలేదు. సీఎస్ఈ, తత్సమాన కోర్సుల్లో మొత్తం 24,968 సీట్లు ఉండగా.. ఇప్పటివరకు 18,588 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు.
దీంతో 6,380 సీట్లు భర్తీ కాలేదు. సంప్రదాయ ఇంజినీరింగ్ కోర్సులుగా పిలుచుకునే కోర్ బ్రాంచీల్లోనూ మేనేజ్మెంట్ కోటా సీట్లు ఆశించిన స్థాయిలో భర్తీకాకపోవడం గమనార్హం. కోర్ గ్రూపుల్లో (సివిల్, మెకానికల్, ఈసీసీ, ఈఈఈ) మొత్తం 4,154 సీట్లు అందుబాటులో ఉండగా, 2,518 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో 1,636 సీట్లు ఖాళీగా మిగిలాయి. అంటే కోర్ గ్రూపుల్లో 39.4% సీట్లు భర్తీ కాకపోవడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

