థర్డ్ ఇయర్‌లోనూ తెలుగు తప్పనిసరి

- అన్ని వర్సిటీల్లో అమలు -పాఠ్యపుస్తకం సిద్ధం
- ఇంజినీరింగ్, సైన్స్ సబ్జెక్టుల్లా ప్రాజెక్ట్ వర్క్
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): డిగ్రీ మూడో సంవత్సరం విద్యార్థులు సైతం ఇక నుంచి ద్వితీయ భాషను తప్పనిసరిగా చదువాల్సిందే. ఇతర సబ్జెక్టుతోపాటు ద్వితీయభాష తెలుగు, హిందీ లేదా సంస్కృతాన్ని సైతం అభ్యసించాల్సిందే. ఇది వరకు మొదటి, రెండో సంవత్సరాల్లో మాత్రమే ద్వితీయ భాషను బోధించేవారు. మూడో సంవత్సరంలో కోర్ సబ్జెక్టులు మాత్రమే ఉండేవి. తాజాగా ఉన్నత విద్యామండలి అధికారులు డిగ్రీ మూడో సంవత్సరంలో కూడా ద్వితీయ భాషను తప్పనిసరిచేశారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల డిగ్రీలో తెలుగును ద్వితీయభాషగా ప్రవేశపెట్టారు. ఇందుకోసం పాఠ్యపుస్తక రచనకు కమిటీ వేసి, ‘తెలుగు సాహితీ దుందుభి’ పేరుతో ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాన్ని సిద్ధంచేశారు. ఓయూ తెలుగు విభాగం ఈ పాఠ్యపుస్తకాన్ని రూపొందించగా, తెలుగు అకాడమీ పుస్తకాన్ని ముద్రించింది. ఈ పాఠ్యపుస్తకాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇంజినీరింగ్, సైన్స్ కోర్సుల్లో మాత్రమే ప్రాజెక్ట్ వర్క్‌ను అమలుచేస్తున్నారు. ఇదే తరహాలో తెలుగుభాషలోను సాహిత్య, సామాజిక ప్రాజెక్ట్‌ల పేరుతో ప్రాజెక్ట్ వర్క్‌ను చేర్చారు. ఇదే పుస్తకంలో జర్నలిజంపై విద్యార్థులకు అవగాహన కల్పించేదుకు ‘జర్నలిజం మౌలికాంశాల’ పేరుతో పాఠ్యాంశాన్ని సైతం చేర్చారు. కార్యక్రమంలో ఓయూ తెలుగుశాఖాధ్యక్షురాలు సూర్యాధనుంజయ్, కాశీం, జ్యోతి, రఘు, లావణ్య, శ్రీధర్, కృష్ణయ్య, శంకరయ్య, సీతారామారావు తదితరులు పాల్గొన్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

