అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాల విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. 2025 ఆగస్టు 15న వెలువరించిన నోటిఫికేషన్ ప్రకారం గత ఏడాది డిసెంబర్ 14న రాత పరీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. 2025 ఆగస్టు 15న వెలువరించిన నోటిఫికేషన్ ప్రకారం గత ఏడాది డిసెంబర్ 14న రాత పరీక్ష నిర్వహించారు. ప్రాథమిక కీ 2025 డిసెంబర్ 21న వెబ్సైట్లో ఉంచి, 24 వరకు అభ్యంతరాలను స్వీకరించినట్టు పేరొన్నారు. ఈ ఫైనల్ కీతోపాటు అభ్యర్థుల సమాధానాల డిజిటల్ ప్రతులను బోర్డు అధికారిక వెబ్సైట్ www.tgprb. inలో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. రాత పరీక్ష ఫలితాల షీట్లను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ఖాతాలలో ఉంచామని, అభ్యర్థులు లాగిన్ అయి ఫలితాలను చూసుకోవచ్చని సూచించారు.
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఈ నెల 17న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులతో హాజరుకావాల్సి ఉంటుందని సూచించారు. విద్యా అర్హతలకు సంబంధించి డిగ్రీ, ఎల్ఎల్బీ/బీఎల్ సర్టిఫికెట్లు, బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్, క్రిమినల్ కోర్టుల్లో మూడేండ్ల అనుభవం ఉన్నట్టు బార్ అసోసియేషన్, కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని తెలిపారు. స్థానికత కోసం 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్,నివాస ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ ద్వారా support @tslprb.inకు మెయిల్ చేయవచ్చని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

