హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): ప్రారంభ దశలో ఉన్న టెక్నాలజీ స్టార్టప్‌ల ప్రోత్సాహానికి రుబ్రిక్స్ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు వెల్లడించారు. ప్రొటోటైప్ దశ నుంచి మినిమమ్ వయబుల్ ప్రొడక్ట్ దశ (ఎంవీపీ) వరకు ఆయా స్టార్టప్‌లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఉత్పత్తుల రూపకల్పన కోసం రుబ్రిక్ను తొలిసారిగా ప్రారంభించామని, ఔత్సాహిక స్టార్టప్ వ్యవస్థాపకులు మే 26లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిన్‌టెక్, అగ్రిటెక్, హెల్త్‌టెక్, డీప్‌టెక్, ఎంటర్ప్రైజ్ టెక్, ఇండస్ట్రీ 4.0 రంగాల్లోని స్టార్టప్‌లకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.