హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు ఆయా సంస్థల్లో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ సభ్యులకు మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మహిళా భద్రత విభాగం ఇంచార్జి, అడిషనల్ డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి ఆన్లైన్ ద్వారా ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలతో మంగళవారం మాట్లాడారు. పోష్యాక్ ్ట(ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ యాక్ట్) ప్రాధాన్యతలు, ఫిర్యాదులు చేయాల్సిన విధానం, రికార్డులను మెయింటెయిన్ చేయడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
మహిళా భద్రతలో భాగంగా కళాశాలలవారీగా గర్ల్స్సేఫ్టీ క్లబ్స్‌ను విద్యార్థులతో ఏర్పాటు చేయించారు. కళాశాల లోపల, పరిసరాల్లో విద్యార్థినుల భద్రతకు ఈ సేఫ్టీక్లబ్స్ చర్యలు తీసుకుంటాయి. అనురాగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఈ తరహా కమిటీ సభ్యులతో మహిళా భద్రత విభాగం ఏడీజీ స్వాతిలక్రా మంగళవారం పలు విషయాలపై చర్చించారు. కాలేజీలో తీసుకుంటున్న చర్యల గురించి డిగి తెలుసుకున్నారు.