కామారెడ్డి డాక్టర్లపై సస్పెన్షన్ ఎత్తివేత
కామారెడ్డి దవాఖానలోని ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనకు సంబంధించి ఇద్దరు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్‌పై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి దవాఖానలోని ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనకు సంబంధించి ఇద్దరు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్‌పై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎలుకలు కరిచిన ఘటనలో ఈ నెల 11న అసోసియేట్ ప్రొఫెసర్ వసంత్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావ్య, నర్సింగ్ ఆఫీసర్ మంజులను సస్పెండ్ చేస్తూ డీఎంఈ త్రివేణి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై వైద్య సంఘాలు భగ్గుమన్నాయి. ఈ నెల 12న టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానలు, టీవీవీపీ పరిధిలో పనిచేస్తున్న వైద్యులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. ఘటన జరిగిన సమయంలో హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఎగ్జామినర్‌గా విధులు నిర్వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంపత్‌పై చర్యలు తీసుకోవడంపై మండిపడ్డారు. రోగిని ఎలుక కరిస్తే శానిటేషన్ ఏజెన్సీ బాధ్యత వహించాల్సి ఉంటుందని, వైద్య సిబ్బంది ఎలా బాధ్యులు అవుతారని ప్రశ్నించారు. తాజాగా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు.. అసోసియేట్ ప్రొఫెసర్ వసంత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావ్య, నర్సింగ్ ఆఫీసర్ మంజులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు డీఎంఈ త్రివేణి ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

