హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ -2026 ఆన్లైన్ దరఖాస్తులను పూరించడంలో విద్యార్థులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఒక ఆప్షన్‌కు బదులు మరో ఆప్షన్ ఎంపిక చేసుకుంటున్నారు.
తొలి రెండు రోజుల్లోనే దాదాపు 100 మంది వరకు విద్యార్థులు దరఖాస్తులను తప్పుగా పూరించారు. ఈ మేరకు దరఖాస్తులను పూరించే సమయంలో తొందరపాటు పనికిరాదని ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా ఓ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు 1800 425 2428 నంబర్‌ను సంప్రదించవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.