కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయండి
మంత్రి సత్యవతి రాథోడ్ | రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ప్రజలు కొవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ప్రజలు కొవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తూ.. రోగులకు ఇబ్బంది లేకుండా వైద్యం, వ్యాక్సినేషన్ అందేటట్లు చూడాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి తగు సూచనలు చేశారు. జిల్లాలో కరోనా కేసుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచించారు.
కరోనా నివారణ చర్యలు పటిష్టంగా చేపట్టాలని, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. ఇదే సమయంలో కరోనా బారిన పడ్డ రోగులకు హాస్పిటల్స్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వెంటిలేటర్లు, ఆక్సిజన్, మందుల కొరత రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

