చింతలపాలెం, ఆగస్టు 7 : పులిచింతల ప్రాజెక్టు 16వ గేటులో స్టాఫ్‌లాగ్ ఎలిమెంట్ అమర్చే పనులు శనివారం ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున వరద నీటిని దిగువకు విడుదల చేసేక్రమంలో 16వ నంబర్ గేటు ఊడిపోయింది. దీంతో ప్రాజెక్టులోని నీటిని మొత్తం ఖాళీ చేసి 16వ గేటు వద్ద స్టాఫ్‌లాగ్ ఎలిమెంట్స్‌ను ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్నారు. శనివారం రాత్రి వరకు 9 స్టాఫ్‌లాగ్ ఎలిమెంట్స్‌ను ఏర్పాటు చేశారు. మరో రెండు అమరిస్తే 16వ గేటు నుంచి పూర్తిగా నీటిని అరికట్టవచ్చని అధికారులు తెలిపారు.