భద్రాద్రిలో వైభవంగా శ్రీరాముని మహాపట్టాభిషేకం
శ్రీరాముని మహాపట్టాభిషేకం | బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్య కల్యాణ మండపం వద్ద శ్రీరాముని మహాపట్టాభిషేకం గురువారం మధ్యాహ్నం వైభవంగా జరిగింది

భద్రాచలం : భద్రాద్రిలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్య కల్యాణ మండపం వద్ద శ్రీరాముని మహాపట్టాభిషేకం గురువారం మధ్యాహ్నం వైభవంగా జరిగింది. భక్తులు లేకుండా వైదిక సిబ్బంది సమక్షంలో క్రతువు నిర్వహించారు. కొవిడ్ దృష్ట్యా నిరాడంబరంగా రాములవారి పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. బంగారు కిరీటం, పాదుకలు, రాజదండంతో రామయ్యకు అలంకరణ చేశారు. రాత్రి 7 గంటలకు రజత రథోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా 27 వరకు నిత్య కల్యాణాలు నిలిపివేశారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా పూజలు, తీర్థ ప్రసాదాలు నిలిపివేశారు. నిన్న భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా కొనసాగిన విషయం తెలిసిందే.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

