పెండింగ్ బిల్లులు చెల్లించాలి: శ్రీనివాస్‌గౌడ్
గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ అధ్యక్షతన బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి: శ్రీనివాస్‌గౌడ్
ఖైరతాబాద్, సెప్టెంబర్ 16: గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ అధ్యక్షతన బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఏ పార్టీకి చెందినవారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్టు చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో సర్పంచులపై రాజకీయ ముద్రలు వేసి వేధిస్తున్నారని ఆరోపించారు.
లే అవుట్ అనుమతుల ఫీజులు, ఇంటి పన్నులు, ఇతర స్థానిక పన్నుల ద్వారా పంచాయతీలకు వచ్చిన నిధులు ఖర్చు చేయకుండా ఖాతాలను ఫ్రీజ్ చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 90 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా సర్పంచులు గ్రామాల్లో అనేక అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు చేపట్టారని, బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్రం అందించే గ్రాంట్లతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

