హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ నెల 6 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో కౌన్సెలింగ్ పూర్తయినట్టు శుక్రవారం టీజీఎస్డబ్ల్యూఆర్ సెక్రటరీ వివరించారు.