ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 6: ఓయూలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ( CELT )లో ఈ నెల 13 నుంచి తరగతులను ప్రారంభించనున్నట్టు డైరెక్టర్ డాక్టర్ సవిన్ సౌడ తెలిపారు. ‘ఎ కోర్స్ ఇన్ ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్’ పేరుతో నిర్వహించే రెండునెలల కోర్సు రెండు సెషన్లలో ప్రత్యేక బ్యాచ్లను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ పేర్లను ఈ నెల 12లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఫీజును డీడీ లేదా ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తామని, వివరాలకు 9014500509 నంబర్లో సంప్రదించాలని సూచించారు.