SPDCLలో 1201 జేఎల్, సబ్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
SPDCL | ఎస్పీడీసీఎల్లో 70 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవగా, మరో 1201 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో జూనియర్ లైన్మెన్ పోస్టులు 1000 ఉండగా, సబ్ ఇంజినీర్ పోస్టులు 201 ఉన్నాయి.
హైదరాబాద్: రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే పోలీస్ శాఖలో, గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా విద్యుత్ శాఖలో ఉద్యోగాల నియామకాలకు ప్రక్రియ ప్రారంభమయింది. ఎస్పీడీసీఎల్లో 70 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవగా, మరో 1201 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో జూనియర్ లైన్మెన్ పోస్టులు 1000 ఉండగా, సబ్ ఇంజినీర్ పోస్టులు 201 ఉన్నాయి. వీటి దరఖాస్తులు ఈనెల 19వ తేదీన, వచ్చే నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి.
19 నుంచి జూనియర్ లైన్మెన్ దరఖాస్తులు
జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. జూలై 17న పరీక్ష నిర్వహిస్తారు.
మొత్తం పోస్టులు: 1000
లిమిటెడ్ రిక్రూట్మెంట్ 553, జనరల్ రిక్రూట్మెంట్ 447 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్మెన్ చేసి ఉండాలి. లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఇంటర్ వొకేషనల్ కోర్సు పాసవ్వాలి. 2022, జనవరి 1 నాటికి అభ్యర్థులు 18 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవరసం లేదు.
దరఖాస్తులు ప్రారంభం: మే 19
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 8
హాల్టికెట్లు డౌన్లోడింగ్: జూన్ 11
రాతపరీక్ష: జూన్ 17
వెబ్సైట్: http://tssouthernpower.cgg.gov.in
వచ్చే నెల 15 నుంచి సబ్ ఇంజినీర్ పోస్టులకు..
201 సబ్ ఇంజినీర్ పోస్టులకు ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 31న రాత పరీక్ష నిర్వహిస్తారు.
మొత్తం పోస్టులు: 201
ఇందులో లిమిటెట్ రిక్రూట్మెంట్ 19, జనరల్ రిక్రూట్మెంట్ 182 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో డిప్లొమా గానీ, డిగ్రీ గాని చేసి ఉండాలి. అభ్యర్థులు 2022, జనవరి 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవరసం లేదు.
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 15
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 5
హాల్టికెట్లు డౌన్లోడింగ్: జూలై 23
రాతపరీక్ష: జూలై 31
వెబ్సైట్: http://tssouthernpower.cgg.gov.in
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

