త్వరలో 738 లెక్చరర్ పోస్టుల భర్తీ
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ జారీచేయనున్నది.
- డీఎల్ 491, సాంకేతిక విద్యలో 247 ఖాళీలు
- టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ.. వివరాలను అందజేసిన అధికారులు
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ జారీచేయనున్నది. డిగ్రీ లెక్చరర్ 491, సాంకేతిక విద్యలో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నియమ నిబంధనలతో కూడిన వివరాలను అధికారులు టీఎస్పీఎస్సీకి ఇటీవలే అందజేశారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ఆర్థిక శాఖ వేర్వేరుగా రెండు జీవోలను జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,098 పోస్టులుండగా, 1,255 రెగ్యులర్,812 కాంట్రాక్ట్, 1,940 గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు.
రెగ్యులర్ పోస్టులను 2012లో భర్తీచేశారు. తాజాగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినివ్వడంతో లెక్చరర్ల కొరత తీరనున్నది. ఇటీవలి కాలంలో పలు కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంసెట్లో సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ కోర్సును ఎంచుకొంటున్నారు. ఈ కోర్సును 129 కాలేజీల్లో నిర్వహిస్తున్నారు. కానీ బోధించేందుకు 50 మంది లెక్చరర్స్ మాత్రమే ఉన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన పలు కోర్సులు, సబ్జెక్టుల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. కాగా, డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు నెట్, సెట్ లేదా పీహెచ్డీ అర్హతను తప్పనిసరిచేశారు.
ఎంటెక్ పూర్తిచేస్తే కొత్త పేస్కేల్..
రాష్ట్రంలో 54 పాలిటెక్నిక్ కాలేజీల్లో 3,647 పోస్టులున్నాయి. 1100 పైచిలుకు లెక్చరర్లు రెగ్యులర్ కాగా, కాంట్రాక్ట్ పద్ధతిలో 405 లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఈ కాలేజీల్లో 247 పోస్టుల భర్తీ ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈ పోస్టుల్లో ఎంటెక్ అర్హత ఉన్న వారికి కొత్త పేస్కేల్ను వర్తింపజేస్తున్నారు. బీటెక్ పూర్తిచేసిన వారికి ప్రారంభవేతనం రూ. 56,100, ఎంటెక్ చదివిన వారికి రూ. 57,700 చెల్లించనున్నారు.
సాంకేతిక విద్యాశాఖలో
సివిల్ ఇంజినీరింగ్ 82, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 24, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 41, మెకానికల్ 36, ఆటోమొబైల్ 15తో పాటు మరికొన్ని కలిపి 247 పోస్టులున్నాయి.
డీఎల్ పోస్టులివే..
కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లయిన్సెస్ 311, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ 39, ఇంగ్లిష్ 23, తెలుగు 27, సంస్కృతం 23, డాటా సైన్స్ 12 సహా మరికొన్ని కలిపి 491 పోస్టులున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- jobs
- lecturer posts
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

