హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి కార్మికశాఖ అధికారులతో జాయింట్ సమావేశం ఏర్పాటు చేయడానికి కేంద్ర కార్మికమంత్రి భూపేందర్ యాదవ్ సమ్మతి వ్యక్తం చేశారని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం న్యూఢిల్లీలో ఐజేయూ, ప్రెస్ అసోసియేషన్, వరింగ్ న్యూస్ కెమెరామెన్స్ అసోసియేషన్లతో కూడిన ప్రతినిధి బృందం కేంద్ర కార్మికమంత్రితో సమావేశమైంది. వరింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ రద్దు తర్వాత తలెత్తిన సమస్యల నేపథ్యంలో దేశంలో జర్నలిస్టులు ఎదురొంటున్న క్లిష్ట పరిస్థితులను ప్రతినిధి బృందం ఆయన దృష్టికి తెచ్చింది. పత్రికా స్వేచ్ఛపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. కార్మికమంత్రి దీనిపై స్పందిస్తూ ఐజేయూ అందించిన వినతిపత్రంపై అంశాలవారీగా చర్చించేందుకు ఒక జాయింట్ సమావేశం ఏర్పాటు చేయాలని కార్మికశాఖ అదనపు కార్యదర్శిని ఆదేశించారు. మంత్రిని కలిసినవారిలో ఐజేయూ సెక్రెటరీ జనరల్ బల్విందర్‌సింగ్ జమ్ము, ఆల్ ఇండియా వరింగ్ న్యూస్ కెమెరామెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హా , ప్రధాన కార్యదర్శి సొందీప్ శంకర్, ఇండియన్ ప్రెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సీకేనాయక్ తదితరులు ఉన్నారు.