నర్సింగ్ కాలేజీలో అధ్యాపకురాలి వేధింపులు
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ అధ్యాపకురాలు కళాశాల ప్రిన్సిపాల్, తోటి అధ్యాపకులు, విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది. ఈ ఘటన సిద్దిపేట నర్సింగ్ కళాశాలలో చోటు చే సుకున్నది.
- ప్రిన్సిపాల్, సిబ్బందిపై దురుసు ప్రవర్తన
- విద్యార్థులపై కుల వివక్ష ఆరోపణలు
- సిద్దిపేట నర్సింగ్ కళాశాలలో ఘటన
- వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, డీఎంఈకి ఫిర్యాదు
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ అధ్యాపకురాలు కళాశాల ప్రిన్సిపాల్, తోటి అధ్యాపకులు, విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది. ఈ ఘటన సిద్దిపేట నర్సింగ్ కళాశాలలో చోటు చే సుకున్నది. సదరు అధ్యాపకురాలు కొంతకాలంగా సహోద్యోగులను బెదిరించడంతోపాటు పరుష పదజాలంతో దూషిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కళాశాలలో ఇష్టానుసరంగా వ్యవహరించడం, పరిపాలనా నియమాలు కాలరాస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. రాష్ట్ర స్థాయిలో కొంతమంది ఉన్నతాధికారుల అండ ఉందనే ధీమాతోనే సదరు అధ్యాపకురాలు దుర్మార్గాలకు తెగబడుతున్నట్టు సమాచారం. గతంలో ఆ కళాశాలలో పనిచేసిన పలువురు ప్రిన్సిపాళ్లపై సైతం సదరు అధ్యాపకురాలు దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఉద్యోగోన్నతుల్లోనూ చేతివాటం
గతంలో అధ్యాపకుల ఉద్యోగోన్నతుల ప్రక్రియకు సైతం ఆటంకాలు కలిగించడంలో సదరు అధ్యాపకురాలి పాత్ర ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తన బ్యాచ్‌కు చెందిన అధ్యాపకుల ఉద్యోగోన్నతుల విషయంలో కొంత మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. నర్సింగ్ విద్యార్థుల పట్ల కూడా కుల ప్రాతిపదికన వివక్ష చూపుతున్నట్టు సమాచారం.
నిర్ణీత బోధనా బాధ్యతలను నిర్వహించకపోవడంతోపాటు, తరగతులను సమర్థవంతంగా నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థుల విద్యా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అధ్యాపకురాలిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కి పలువురు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

