హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయి ప్రస్తుతం చంచల్‌గూడ(Chanchalguda ) జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ(Shiva balakrishna)ను ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఎనిమిది రోజుల పాటు శివ బాలకృష్ణ ఏసీబీ కస్టడీలో ఉండనున్నారు. ఈ మేరకు బుధవారం శివ బాలకృష్ణను అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి (ACB office) తరలించారు.
ఈ విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. కాగా, రెరా కార్శదర్శి శివ శివబాలకృష్ణపై సస్పెన్సన్ వేటు పడిన సంగతి తెలిసిందే. శివబాలకృష్ సస్పెన్షన్‌పై హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ దాన కిశోర్ మంగళవారం రాత్రి ఉత్వర్వులు జారీ చేశారు. గతంలో మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా పని చేశారు శివ బాలకృష్ణ. రెరా ఇంచార్జి కార్యదర్శిగా కూడా పని చేశారు.