Crime news | జయశంకర్ జిల్లాలో నిషేధిత పత్తి విత్తనాల పట్టివేత
కాటారం, జూన్ 27: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు, వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు అంచ హన్మంతరావును అరెస్టు చేశారు. ఈ మేరకు కాటారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో సోమవారం విలేకరుల సమావేశంలో సీఐ రంజిత్‌రావు వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గనికపూడి గ్రామానికి చెందిన అంచ హన్మంతరావు నస్తురుపల్లి గ్రామంలో 8 ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నాడు. అందులో నిషేధిత పత్తి విత్తనాలను సాగు చేసేందుకు తీసుకువచ్చాడు. ఈక్రమంలో విశ్వసనీయ సమాచరంతో పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఆదివారం సాయంత్రం తనిఖీలు నిర్వహించగా.. హన్మంతరావు వద్ద నిషేధిత పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి.
ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి 3 కేజీల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్ఐ సీహెచ్ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి జీ రామకృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారి రాజన్న, సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

