హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): హైకోర్టుకు ఈ నెల 10 నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 8, 9, 16 (శని, ఆదివారాలు) కలిపి వరుసగా 9 రోజుల సెలవుల తర్వాత 17న హైకోర్టు తిరిగి ప్రారంభమవుతుంది. అత్యవసర కేసులను 10న దాఖలు చేసుకోవచ్చు. వాటిని 12న వెకేషన్ కోర్టు విచారిస్తుంది.