భీంరెడ్డిపై చూపిన జాలి.. దళిత, బహుజనులపై లేదా?.. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ ట్వీట్
డీఎస్పీ భీంరెడ్డి అవినీతి కేసులో రెండు చేపల నీతి కనిపిస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. భీంరెడ్డి విషయం లో ఏసీబీ తీరుపై ఆయన సోమవారం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ): డీఎస్పీ భీంరెడ్డి అవినీతి కేసులో రెండు చేపల నీతి కనిపిస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. భీంరెడ్డి విషయం లో ఏసీబీ తీరుపై ఆయన సోమవారం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘చిన్న చేపలకో న్యాయం-తిమింగలాలకు మరో న్యా యం ఉండకూడదు సీఎం రేవంత్ గారు. బంజారాలకు, మాలమాదిగలకు ఒకన్యా యం, భీంరెడ్డికి మరో న్యాయం ఎట్లా?’ అని ప్రశ్నించారు. ‘భీంరెడ్డిపై చూపిన జాలి మిగతా బహుజన బిడ్డలైన వారిపై చూపలేదు.
మా బిడ్డలను కూడా వెంటనే జైలు నుంచి విడుదల చేయండి’ అని డిమాండ్ చేశారు ‘దమ్ముంటే తిమింగలాలను మింగే రాకాసి తిమింగలాలు రేవంత్‌రెడ్డి-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లక్ష కోట్ల చీకటి సామ్రాజ్యాన్ని బహిర్గతం చే యండి. సొర చేపలు, చిరు చేపలు అన్నీ వెంటనే సర్దుకుంటయ్. మసకబారిన మీ ఏసీబీ ప్రతిష్ఠ మళ్లీ తిరిగొస్తుంది. ఐదు రోజుల తర్వాత, డీఎస్పీ భీంరెడ్డిని అరెస్టు చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని కులం, పలుకుబడి, బలవంతుల పైరవీల ఆధారంగా కాకుం డా, కూలంకషంగా పరిశోధించిన తరువాతనే, కేసులు పెట్టి, నిజమైన అవినీతిపరులను జైలుకు పంపండి’ అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

