Minister IK Reddy | వచ్చే సీజన్లో 20.02 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం : మంత్రి ఐకే రెడ్డి
Minister IK Reddy | హరితహారంతో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. ఇప్పటి వరకు 283.82 కోట్ల మొక్కలను నాటాం. హరిత నిధికి రూ.49.115 కోట్లు సమకూరాయి. కొనోకార్పస్ మొక్కల పెంపకాన్ని నిషేధించామని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. హరితహారంపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, దేశపతి శ్రీనివాస్అ డిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
హైదరాబాద్ : హరితహారంతో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. ఇప్పటి వరకు 283.82 కోట్ల మొక్కలను నాటాం. హరిత నిధికి రూ.49.115 కోట్లు సమకూరాయి. కొనోకార్పస్ మొక్కల పెంపకాన్ని నిషేధించామని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. హరితహారంపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, దేశపతి శ్రీనివాస్అ డిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
అడవులను పునరుద్ధరించి, రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి 2015 సంవత్సరంలో బీజం వేశారు. ముఖ్యమంత్రి దూరదృష్టి, రాజకీయ సంకల్పం, ప్రణాళికకు అనుగుణంగా అందరి సహకారంతో గత తొమ్మిదేళ్ళుగా రాష్ట్రంలో హరితహారం ఓ ఉద్యమంలా కొనసాగుతుందని ఆయన తెలిపారు.
హరితహార కార్యక్రమం ద్వారా 230 కోట్లు మొక్కలు నాటడమే లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 283.82 కోట్లకు మొక్కలు నాటాము. ఇందులో 55.30 కోట్ల మొక్కలను అటవీ పునరుద్దరణలో భాగంగా పెంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి రూ. 11,095 కోట్లను వెచ్చించామని తెలిపారు. తొమ్మిదవ విడత హరితహారం కార్యక్రమంలో 19.29 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 9.02 కోట్ల మొక్కలను నాటాం. రానున్న 2024 సీజన్ లో 20.02 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
వానలు వాపస్ రావాలే.. కోతులు వాపస్ పోవాలే అనే సీఎం కేసీఆర్ నినాద స్ఫూర్తితో కోతుల బెడదను నివారించేందుకు నిర్మల్ జిల్లా చించోలి (బి) లో కోతుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి, స్టెరిలైజేషన్ చేస్తున్నాం. గ్రామపంచాయతీల నుంచి పట్టుకు వచ్చిన కోతులను అటవీ మార్గంలోని రహదారుల్లో వదిలిపెట్టడం వల్ల అవి మళ్లీ గ్రామాల్లోకి వస్తున్నాయి. అలా చేయకుండా కోతుల పునరావాస కేంద్రంలో వదిలేలా చర్యలు తీసుకుంటున్నామని , అటవీ లోపల, అటవీ బయట విస్తృతంగా పండ్ల మొక్కలను నాటుతున్నామని వివరాలను వెల్లడించారు.
పచ్చదనం పెంపులో భాగంగా వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో హరితనిధిని ఏర్పాటు చేశాం. ఇప్పటిదాకా రూ.49.115 కోట్లు విరాళాల రూపంలో హరిత నిధికి సమకూరాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమం రాష్ట్రంలో సత్ఫలితాలను ఇస్తున్నదని పేర్కొన్నారు. 2015 నుంచి 2021 వరకు తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం (గ్రీన్ కవర్) 7.70 శాతం పెరిగినట్లు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్స్ (ISFR) ప్రకటించిందని గుర్తు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

