హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 80వ సారి. ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముందుగా గోవాకు వెళ్లారు. అకడ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గోయ్ రాఖోన్న్ యాత్రలో పాల్గొన్నారు. గోవా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గత నెల 22న పనాజీలో ఈ గోయ్ రాఖోన్న్ యాత్ర మొదలైంది.
- 80వ సారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
- ఇండీ కూటమి ధర్నాలో పాల్గొననున్న సీఎం
హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 80వ సారి. ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముందుగా గోవాకు వెళ్లారు. అకడ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గోయ్ రాఖోన్న్ యాత్రలో పాల్గొన్నారు. గోవా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గత నెల 22న పనాజీలో ఈ గోయ్ రాఖోన్న్ యాత్ర మొదలైంది. రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా చేపట్టిన యాత్రలో భాగంగా కునోలిమ్ చేరుకున్న రేవంత్‌రెడ్డి, చీఫ్టెన్స్ స్మారకం వద్ద నివాళులర్పించారు. గోవా కార్యక్రమం పూర్తయిన వెంటనే ఆయన అకడి నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి నిర్వహిస్తున్న మహాధర్నాలో రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి రేవంత్ పాల్గొననున్నారు.
ఎల్‌నినోపై నాన్ సీరియస్ !
రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ప్రభుత్వం ఎంత నాన్ సీరియస్‌గా ఉన్నదో చెప్పేందుకు మరో ఉదాహరణ ఇది. కరువు, ఎన్‌నినోపై చర్చించాలని, సోమవారం మంత్రులంతా అందుబాటులో ఉండాలంటూ ప్రభుత్వం 9వ తేదీనే మోస్ట్ ఇమ్మీడియట్ అంటూ ఓ నోట్ విడుదల చేసింది. చీఫ్ సెక్రటరీ సంజయ్‌జాజు ఉత్తర్వులు కూడా జారీచేశారు. కాంగ్రెస్ అనుకూల మీడియా ఇక సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగుతున్నారని, ఎల్‌నినో నేపథ్యంలో ఊరటనిచ్చే నిర్ణయాలు ప్రకటిస్తారని ఊదరగొట్టారు. ఇదంతా నిజమే అనుకున్నారు. సోమవారం 11 గంటలకు మీటింగ్ ఉంటుందని అనుకుంటున్న సమయంలో, ఆదివారం సీఎం గోవా పర్యటనకు, అక్కడి నుండే ఢిల్లీ వెళ్లిపోయారు. మొత్తం మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెలేలు, ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లిపోయారు. దీంతో సోమవారం మంత్రి వర్గ సమావేశం ఉంటుందా? లేదా? అనే అంశం పై స్పష్టత లేదు. రాష్ట్రంలో ప్రజలు కరువు, సాగు, తాగునీటి కొర త, కరెంట్ కోతలతో సతమతమవుతుంటే రాజకీయం చేసేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా కట్టగట్టుకొని ఢిల్లీకి పోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

