సంగారెడ్డి : బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు(Singuru project) నుంచి నీటి పారుదలశాఖ అధికారులు(Irrigation officials) మంగళవారం ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల(Release of water) చేశారు. ఘనపూర్ (Ghanpur) ఆయకట్టుకు మూడో విడత నీటి విడుదలలో భాగంగా 1460 క్యూసెక్కుల నీటిని జెన్కో గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు, రైతులు, గొర్లకాపరులు అటువైపు వెళ్లకూడదని హెచ్చరించారు.