ఇంజినీరింగ్ కటాఫ్ ర్యాంకుల విడుదల
ఎంసెట్ అభ్యర్థుల సౌకర్యార్థం ఉన్నత విద్యామండలి మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
- గత ఏడాది వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి
- ఎంసెట్ హెల్ప్‌లైన్ నంబర్లు 76600 09768/ 69
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ఎంసెట్ అభ్యర్థుల సౌకర్యార్థం ఉన్నత విద్యామండలి మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది వివిధ ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించిన కటాఫ్ ర్యాంకుల వివరాలను https:// www.tsche.ac.in వెబ్సైట్లో పొందుపరిచింది. ఆ కాలేజీల్లో నిరుడు భర్తీ అయిన కోర్సులు, క్యాటగిరీ, రిజర్వేషన్ల వారీగా కటాఫ్ ర్యాంకులతోపాటు, ట్యూషన్ ఫీజుల వివరాలను సైతం వెబ్సైట్లో పొందుపరిచారు.
ఇంజినీరింగ్‌తోపాటు, ఐసెట్, ఈసెట్, పాలిసెట్ కటాఫ్ ర్యాంకుల వివరాలను సైతం వెబ్సైట్లో ఉంచారు. వీటిని పరిశీలించి, విద్యార్థులు తమ ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో అంచనాకు రావొచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబా ద్రి తెలిపారు. విద్యార్థులు కాలేజీలు, కన్సల్టెన్సీల చుట్టూ తిరిగి అవస్థ పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు. ఇది ఎంసెట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ల ఎంపికకు సైతం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది.
రెండు హెల్ప్లైన్లు
కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల సందేహాల నివృత్తికి ఉన్నత విద్యామండలిలో రెండు హెల్ప్లైన్లను ఏర్పాటు చేశారు. ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే విద్యార్థులు 76600 09768/ 69 నంబర్లను సంప్రదించాలని ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

