Reels Contest | హైదరాబాద్ అభివృద్ధిపై రీల్స్ కాంటెస్ట్.. గెలిస్తే రూ. లక్ష నగదు బహుమతి
Reels Contest | హైదరాబాద్ నగరంలో గత తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిపై తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్( Telangana Digital Media Wing ) రీల్స్ కాంటెస్ట్( Reels Contest ) పోటీలను నిర్వహిస్తుంది. ఈ పోటీలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా రూ. లక్ష నగదు ఇవ్వనున్నట్లు తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ప్రకటించింది.
Reels Contest | ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) నాయకత్వంలో, ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్( Minister KTR ) చొరవతో.. హైదరాబాద్ నగరం( Hyderabad City ) ఎంతో అభివృద్ధి చెందింది. ఓ వైపు అభివృద్ధి పరుగులు పెట్టడం, మరో వైపు పెట్టుబడులు తరలిరావడంతో హైదరాబాద్ నగరం జోడెద్దుల మాదిరిగా ముందుకు దూసుకెళ్తోంది. అంతే కాదు.. నగరాన్ని బెస్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అటు ప్రజా రవాణాకు, ఇటు పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇందులో భాగంగా నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీ( Traffic Free City )గా మార్చేందుకు మెట్రో రైలు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, లింకు రోడ్లు చేపట్టారు. మరో వైపు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో గత తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిపై తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్( Telangana Digital Media Wing ) రీల్స్ కాంటెస్ట్( Reels Contest ) పోటీలను నిర్వహిస్తుంది. ఈ పోటీలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా రూ. లక్ష నగదు ఇవ్వనున్నట్లు తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ప్రకటించింది.
హైదరాబాద్ అభివృద్ధిపై యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్లో తమ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసే అవకాశం కల్పించింది. ఈ నాలుగు వేదికల్లో.. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి, నగర ప్రాముఖ్యత గురించి ఆసక్తికరంగా.. 60 సెకన్ల నిడివితో ఓ వీడియో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్‌ను @DigitalMediaTS కు ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. తమ వీడియోలను dir_dm@telangana.gov.in కు మెయిల్ కూడా చేయొచ్చు. వీడియోస్‌ను పోస్టు చేసేందుకు ఏప్రిల్ 30 చివరి తేదీ. ఈ కాంటెంస్ట్‌కు సంబంధించి ఇతర వివరాల కోసం.. https://it.telangana.gov.in/contest/ ను సంప్రదించొచ్చు.
Great with Reels? Love Hyderabad? Here’s something exciting for you!
Capture the charm and vividness of #HappeningHyderabad and share with us by tagging @DigitalMediaTS
Win cash prizes worth Rs 1,00,000/-
Entries close on April 30. For details visit https://t.co/8J20OoaI9v pic.twitter.com/oaL1KTlI0Y
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) April 4, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

