కొవిడ్ సంక్షోభంలో రెడ్‌క్రాస్ వాలంటీర్ల సేవలు అపూర్వం : గవర్నర్
రెడ్‌క్రాస్ వాలంటీర్ల సేవలు అపూర్వం | కరోనా సంక్షోభం వేళ రెడ్‌క్రాస్ వాలంటీర్ల సేవలు అపూర్వమని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శనివారం ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రతినిధులతో పుదుచ్చేరి నుంచి వర్చువల్ విధానంలో ఆమె మాట్లాడారు.

హైదరాబాద్ : కరోనా సంక్షోభం వేళ రెడ్‌క్రాస్ వాలంటీర్ల సేవలు అపూర్వమని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శనివారం ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రతినిధులతో పుదుచ్చేరి నుంచి వర్చువల్ విధానంలో ఆమె మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా చైతన్యం చేయడం కీలకమని అన్నారు. నిబంధనలు పాటిస్తేనే సంక్షోభం నుంచి బయటపడగలమని పేర్కొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే కరోనా ప్రబలకుండా చూడగలమని చెప్పారు. ప్రజల్ని మరింత చైతన్యం చేసేందుకు రెడ్‌క్రాస్ సొసైటీ కృషి చేయాలని సూచించారు.
కరోనా సంక్షోభంలోనూ సంస్థ సామాజిక బాధ్యతతో సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
మరిన్ని సేవా కార్యక్రమాలతో బాధితులకు అండగా నిలవాలని గవర్నర్ సంస్థ ప్రతినిధులను కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

