భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : ఆర్డీవో చంద్రకళ
రాష్ట్రంలో భూమి రికార్డుల్లో ఎంత విస్తీర్ణం నమోదై ఉంటుందో క్షేత్రస్థాయిలోనూ అంతే భూమి ఉండేలా భూభారతి భూ రీసర్వే నిర్వహిస్తున్నట్లు గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ తెలిపారు.
రాయపోల్.నవంబర్ 11 : రాష్ట్రంలో భూమి రికార్డుల్లో ఎంత విస్తీర్ణం నమోదై ఉంటుందో క్షేత్రస్థాయిలోనూ అంతే భూమి ఉండేలా భూభారతి భూ రీసర్వే నిర్వహిస్తున్నట్లు గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ తెలిపారు. భూ వివాదాలకు తావులేకుండా స్పష్టమైన, పారదర్శకమైన డిజిటల్ రికార్డులు రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఆరేపల్లి గ్రామంలో భూభారతి భూ రీసర్వే పైలెట్ ప్రాజెక్టుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ..సిద్దిపేట జిల్లాలో రెండో విడతలో భాగంగా రాయపోల్ మండలంలోని ఆరేపల్లి, ఎల్కల్ గ్రామాలను భూ రీసర్వేకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
రీసర్వే ద్వారా ప్రతి రైతు భూమికి సంబంధించిన స్పష్టమైన డిజిటల్ మ్యాప్ సిద్ధమవుతుందని,భవిష్యత్తులో భూ సరిహద్దులు, విస్తీర్ణం తదితర అంశాల్లో వివాదాలు తలెత్తకుండా ఉంటాయని వివరించారు. నిజాం పాలన కాలంలోనే రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే జరిగిందని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం చేపట్టిన రీసర్వే ప్రక్రియ విజయవంతం కావాలంటే రైతుల సహకారం ఎంతో అవసరమన్నారు.
భూముల కొలతల సమయంలో రైతులు తమకు సంబంధించిన భూ పత్రాలను అందుబాటులో ఉంచుకొని అధికారులకు సహకరించాలని కోరారు. రైతుల భాగస్వామ్యంతో రీసర్వేను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణమోహన్, ఆర్ఐ రాజమల్లు, సర్పంచ్ కర్రోళ్ల దివ్య ,సర్వేయర్ సిద్ధార్థ, లైసెన్స్ సర్వేయర్ శేఖర్, జీపీఓ ప్రభాకర్, ఉపసర్పంచ్ వీరేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : ఆర్డీవో చంద్రకళ
భట్టి పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల నిర్బంధం.. దాస్యం వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్!
Vinay Bhaskar | వినయ్ భాస్కర్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
Jailer 2 | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, డిలీటెడ్ సీన్స్‌పై అభిమానులకు నిరాశ!
Presidents Bodyguard: రాష్ట్రపతి బాడీగార్డ్ యూనిట్‌లోని జవాన్‌పై కాల్పులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

