మెదక్‌లో అరుదైన ‘గజలక్ష్మి’ శిల్పం
మెదక్ జిల్లా కొల్చారం మండలం యనగండ్ల గ్రామంలో రాష్ట్రకూటుల కాలానికి చెందిన అరుదైన గజలక్ష్మి శిల్పాన్ని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షులు శ్రీరామోజు హరగోపాల్ పరిశీలించారు.
- రాష్ట్రకూటుల కాలానిదిగా గుర్తించిన ప్లీచ్ ఇండియా ఫౌండేషన్
- భావితరాలకు అందించాలని గ్రామస్తులకు చరిత్రకారుల సూచన
హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా కొల్చారం మండలం యనగండ్ల గ్రామంలో రాష్ట్రకూటుల కాలానికి చెందిన అరుదైన గజలక్ష్మి శిల్పాన్ని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షులు శ్రీరామోజు హరగోపాల్ పరిశీలించారు. మెదక్‌లో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బుర్రా సంతోష్ ఇచ్చిన సమాచారం మేరకు గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి దగ్గర రావిచెట్టు కింద ఉన్న గజలక్ష్మి శిల్పాన్ని ఆదివారం సందర్శించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎకడాలేని అమృత మధన దృశ్యం ఉన్న ఈ గజలక్ష్మి-నటరాజ శిల్పాన్ని భావితరాలకు అందించాలని శివనాగిరెడ్డి, హరగోపాల్ గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపాల్‌గౌడ్, సిద్ధరాములు, ప్రదీప్, నరేశ్, లోకేశ్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

