చేతి గడియారంలా శానిటైజర్

- రాజస్థాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఆవిష్కరణ
- కోరక్షక్ బ్యాండ్ పేరుతో ఈ-కామర్స్‌లో విక్రయం
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): శానిటైజర్‌ను గడియారంలా చేతికి పెట్టుకోవచ్చు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు శానిటైజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి నింపి 150 సార్లు వినియోగించుకోవచ్చు. రాజస్థాన్‌లోని జహలావర్ జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయాజ్ షేక్ ఈ ఆవిష్కరణకు జీవం పోశాడు. హెల్త్ వర్కర్‌గా పని చేసే తన తల్లికి నిరంతరం శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో ఈ పరికరాన్ని తయారుచేశాడు. ఇతని ఆవిష్కరణకు మెచ్చిన ఆ జిల్లా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ సాజిద్‌ఖాన్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది కోసం 600 పరికరాలను తయారు చేయించారు. 15ఎంఎల్ కెపాసిటీతో 30 గ్రాముల బరువుండే ఈ పరికరం 2 ఇంచుల వెడల్పు, 1 ఇంచు ఎత్తు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆవిష్కరణను రాజస్థాన్ ప్రభుత్వం ఐ-స్టార్ట్ అనే స్టార్టప్‌లను ప్రోత్సహించే కార్యక్రమంలో రిజిస్ట్రార్ చేయించింది. దీనికి పేటెంట్ కూడా తీసుకున్నానని, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అమెజాన్‌లో ‘కోరక్షక్ బ్యాండ్’ పేరుతో అమ్ముతున్నట్టు అయాజ్షేక్ తెలిపాడు. తన తల్లి కోసం ఈ పరికరాన్ని తయారు చేయాలని ఈ ఏడాది జనవరిలో అనుకున్నానని, నాలుగుసార్లు విఫలమయ్యాక చివరకు ఫలితం వచ్చిందని షేక్ పేర్కొన్నాడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

