హైదరాబాద్ జంట నగరాల్లో వర్షం
హైదరాబాద్ : జంట నగరాల పరిధిలో సోమవారం సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు వర్షం కురవడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, చిలకలగూడ, మారేడ్‌పల్లి, బేగంపేట, ప్యాట్నీ, ప్యారడైజ్, అమీర్‌పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, ఖైరతాబాద్, కోఠి ప్రాంతాల్లో వర్షం కురిసింది.
రాంనగర్, హిమాయత్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, జీడిమెట్ల, షాపూర్ నగర్, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, పటాన్ చెరువు, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గాజులరామారాం, జీడిమెట్ల, సూరారం, కుత్బుల్లాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లోనూ వానపడింది. అలాగే సంగారెడ్డితో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి.
మరో వైపు ఇవాళ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పాటయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్రమట్టం నుంచి 5.8కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. దీని ఫలితంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దీక్షా దివస్ బహిరంగ సభను జయప్రదం చేయండి’
‘విద్యార్థుల సమగ్ర వికాసంపై శ్రద్ధ చూపాలి’
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : డీఏఓ వి.బాబురావు
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

