ఎంఎస్ఎంఈలకు దన్ను
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను ప్రోత్సహించేందుకుగాను సంబంధిత మంత్రిత్వ శాఖ పలు నూతన పథకాలను ప్రవేశపెట్టింది.
- కొత్త డిజైన్ల అభివృద్ధికి సాంకేతిక సహకారం
- నూతన స్కీంలతో మేథో హక్కుల పరిరక్షణ
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను ప్రోత్సహించేందుకుగాను సంబంధిత మంత్రిత్వ శాఖ పలు నూతన పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా వినూత్న ఆవిష్కరణలు చేసేవారికి, సంస్థలకు చేయూతనిచ్చేలా ఇన్నోవేటివ్ స్కీంను అందుబాటులోకి తెచ్చింది. అలాగే డిజైనింగ్, మేథో సంపత్తి పరిరక్షణ తదితర స్కీంలను పరిచయం చేసింది. వీటికింద అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన సహకారం అందుతుంది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల అభివృద్ధికి పలు ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధునాతన యంత్రాలు, సరికొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో ఇంక్యుబేషన్ స్కీం ప్రధానమైనది. దీనికింద నూతన ఆవిష్కరణలకు రూ.15 లక్షల వరకు, మెషినరీ కోసం కోటి రూపాయలదాకా ఆర్థిక సహాయం అందుతుంది. ఆయా పథకాలను పరిశీలిస్తే..
ఇన్నోవేటివ్ పథకం
సృజనాత్మకత, నూతన సాంకేతికతను ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారు. ఆలోచనలకు విలువను జోడిస్తూ అవి కార్యరూపం దాల్చేందుకు అవసరమైన సహకారం అందిస్తారు. ఇందుకోసం టెక్నికల్ కాలేజీలు, యూనివర్శిటీలు, ఇతర ప్రభుత్వరంగ ప్రొఫెషనల్ కాలేజీలు/సంస్థలు, ఆర్అండ్డీ సంస్థలు, ఎన్జీవోలు తమ ఆవిష్కరణల వివరాలతో ఎంఎస్ఎంఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
డిజైనింగ్ కోసం..
ఈ పథకం కింద తయారీ రంగంలో నూతన యంత్రాల రూపకల్పనకు అవసరమైన సహకారం అందిస్తారు. ఎంఎస్ఎంఈలు ఒక గ్రూపుగా ఏర్పడి తమ అవసరాలకు అనుగుణంగా యంత్రాలు రూపొందించాలని కోరితే వారికి నిపుణులచే సలహాలను అందించడంతోపాటు తక్కువ ఖర్చులో వాటి రూపకల్పనకు అవసరమైన చర్యలు చేపడతారు.
లీన్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు..
ఇందులోభాగంగా యంత్ర పరికరాల తయారీ ఖర్చులు, సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన శాస్త్రీయ విధానాల అమలుకు సహకారం అందిస్తారు. దీనికి కన్సల్టెంటు ఫీజులో 80 శాతం వరకు సహాయం చేస్తారు.
మేథో సంపత్తికి..
కొత్త ఆవిష్కరణలకు మేథో హక్కులను ప్రదానం చేసేందుకు అవసరమైన ఖర్చులను ఈ పథకం కింద రీయింబర్స్ చేస్తారు. పేటెంట్, ట్రేడ్‌మార్క్, జియోగ్రాఫికల్ ఇండికేషన్, డిజైన్ తదితర వాటి రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చులు చెల్లిస్తారు. విదేశీ పేటెంట్‌కు గరిష్ఠంగా రూ.5 లక్షలు, దేశీయ పేటెంట్‌కు లక్ష రూపాయలు, జీఐ రిజిస్ట్రేషన్‌కు రూ.2 లక్షలు, డిజైన్ రిజిస్ట్రేషన్‌కు రూ.15 వేలు, ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్‌కు రూ.10 వేలు ఆర్థిక సహాయం చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

