Engineering Colleges | మేనేజ్మెంట్ కోటా సీట్లు.. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల వేలంపాట
మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు అక్రమాలకు తెరలేపాయి. వేలంపాట తరహాలో సీట్లను విక్రయిస్తున్నాయి. సింహభాగం సీట్లను ఇప్పటికే అమ్మేసుకున్నాయి. తల్లిదండ్రులు అడిగితే.. ఆరా తీస్తే సీట్లు లేవు అని చెప్పేస్తున్నాయి.
- బహిరంగ మార్కెట్లో అమ్మకాల్లా సీట్ల విక్రయాలు
- ముందే అమ్మేసుకున్న కాలేజీలు
- నిబంధనలు పాటించవి వైనం
- ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ రాకముందే వక్రమార్గాలు
- మధ్యవర్తుల రంగప్రవేశం.. తల్లిదండ్రులకు ఫోన్లు
Engineering Colleges | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు అక్రమాలకు తెరలేపాయి. వేలంపాట తరహాలో సీట్లను విక్రయిస్తున్నాయి. సింహభాగం సీట్లను ఇప్పటికే అమ్మేసుకున్నాయి. తల్లిదండ్రులు అడిగితే.. ఆరా తీస్తే సీట్లు లేవు అని చెప్పేస్తున్నాయి.
కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశమివ్వడంలేదు. దరఖాస్తులిచ్చినా స్వీకరించడంలేదు. మరోవైపు కన్సల్టెంట్లు, మధ్యవర్తుల ద్వారా బేరసారాలు సాగిస్తున్నాయి. అంగట్లో అమ్మినట్టుగా, వేలం వేసినట్టుగా కంప్యూటర్ సైన్స్ సీట్లను కాలేజీలు అమ్ముతున్నాయి. ఈ సీట్లకున్న డిమాండ్‌తో ఫీజులు అడ్డగోలుగా పెంచాయి. ఇప్పుడు సీఎస్ఈ సీటు ఫీజు 16 లక్షలు పలుకుతుంది. ఒకప్పుడు రూ.8-10 లక్షలున్న ఈ సీట్ల ఫీజులు తాజాగా రూ. 16 -18 లక్షలకు చేరాయి.
నోటిఫికేషన్ ఇవ్వకముందే..
నిబంధనల ప్రకారం బీ క్యాటగిరీ సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీచేస్తుంది. ఆ తర్వాతే కాలేజీలు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, మెరిట్ ప్రకారం ఆయా సీట్లను భర్తీచేయాలి. కానీ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇవ్వకుండానే.. మెరిట్‌తో పనిలేకుండానే కాలేజీలు సంత తరహాలో సీట్లను విక్రయిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ క్యాటగిరీ సీట్లను భర్తీ మొదలుకాకముందే. అసలు ఎప్‌సెట్ ఫలితాలు రాకముందే కాలేజీలు బేరాలు మొదలు పెట్టాయి.
ఇక ఎప్‌సెట్ ఫలితాలు విడుదలకావడంతో ఈ సీట్లకు డిమాండ్ మరింత తీవ్రమైంది. బీ క్యాటగిరీ సీట్ల భర్తీలో మెరిట్ పాటించని ఇంజినీరింగ్ కాలేజీలకు నిరుడు తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా సీట్లు భర్తీచేయడాన్ని సీరియస్‌గా పరిగణించింది. మెరిట్ పాటించని మూడు కాలేజీలకు జరిమానా విధించింది. అయితే, ఏకంగా జరిమానాలు చెల్లించి చేతులు దులుపుకున్నాయి. ఇక ఉన్నత విద్యామండలి అధికారులు సైతం కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారు.
- షేక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సీటుపై ఆరా తీస్తే రూ. 14లక్షలు చెబుతున్నారు.
- నాగోలు బండ్లగూడ ప్రాంతంలోని మరో కాలేజీల్లో సీఎస్ఈ సీటుకు ఐదు లక్షల డొనేషన్ కట్టాల్సిందే. ఇక ఒక్కోసంవత్సరానికి ఫీజుగా 1.3లక్షలు చెల్లించాల్సిందే.
- నగరం నడిబొడ్డున ఉన్న మరో ఇంజినీరింగ్ కాలేజీలో సీటు విలువ రూ.12-16 లక్షలు పలుకుతుంది.
- గండిపేటలోని మరోకాలేజీలో సీఎస్ఈ సీటు రూ.18లక్షలపై మాటే. అసలు ఈ కాలేజీలో సీటు గురించి ఆరా తీస్తే లేదు అన్న సమాధానామే వస్తుంది.
ర్యాటిఫికేషన్లో అక్రమాలు
బీ క్యాటగిరీ సీట్లను భర్తీచేసిన తర్వాత కాలేజీలు సీట్ల వివరాలను ఉన్నత విద్యామండలికి సమర్పిస్తాయి. ఉన్నత విద్యామండలి ఈ సీట్ల భర్తీలో కాలేజీలో నిబంధనలు పాటించాయా? లేదా? అని పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఉన్నత విద్యామండలి తూతూమంత్రంగా ర్యాటిఫికేషన్‌ను చేస్తుందన్న విమర్శలున్నాయి. దీని వెనుక పెద్ద దందా నడుస్తున్నదని, కొంత మందికి కాసులు ముడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తే కొంత పారదర్శతకు ఆస్కారముంటుందని, లేదంటే బీ క్యాటగిరీ సీట్లను కూడా కన్వీనరే భర్తీచేస్తే ఈ దందాకు చెక్పడుతుందన్న వాదనలున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

