Colleges Bandh | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు.. వచ్చేనెల 3 నుంచి వృత్తి విద్యా కాలేజీలు బంద్
ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిల పెండింగ్‌పై ప్రైవేటు వృత్తి విద్యా, ఇంజినీరింగ్ కాలేజీలు మరోసారి పోరుకు సిద్ధమయ్యాయి. పెండింగ్ ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3 నుంచి బంద్ (Colleges Bandh) పాటిస్తామని ప్రైవేట్ కళాశాలల సమాఖ్య తెలిపింది.
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిల పెండింగ్‌పై ప్రైవేటు వృత్తి విద్యా, ఇంజినీరింగ్ కాలేజీలు మరోసారి పోరుకు సిద్ధమయ్యాయి. పెండింగ్ ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3 నుంచి బంద్ (Colleges Bandh) పాటిస్తామని ప్రైవేట్ కళాశాలల సమాఖ్య తెలిపింది. ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసులు అందజేస్తామని వెల్లడించింది. ఈనెల 25న విద్యార్థి సంఘాలతో, 26న సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని, నవంబర్ 1వ తేదీ నాటికి అన్ని పార్టీల నేతలతో కలిసి సమావేశం జరపాలని ఫతి నిర్ణయించింది.
పెండింగ్ బకాయిలపై సెప్టెంబర్ 15 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని ప్రైవేటు కాలేజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో రెండు రోజుల పాటు కాలేజీలు తెరచుకోలేదు. అయితే విడతల వారీగా ఫీజులు చెల్లిస్తామని సర్కార్ ఒప్పుకోవడంతో బంద్‌ను విరమించాయి. సెప్టెంబరులో రూ.600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అలాగే తొలుత రూ.600 కోట్లను చెల్లించి.. మిగిలిన బకాయిల్లో మరో రూ. 600 కోట్లను దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని పేర్కొంది. అయితే దీపావళి వచ్చినా ఇంకా నిధులు మంజూరు చేయకపోవడంతో కాలేజీల బంద్ తప్పడంలేదని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వెల్లడించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

