పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా?
కరెంట్ కోతలతో నీళ్లందక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ సర్కార్కు పట్టింపు లేకుండా పోయిందని రైతులు మండిపడుతున్నారు. అవసరమైనప్పుడు విద్యుత్తును అందించకపోతే ఇంకెప్పుడిస్తారని ప్రశ్నిస్తున్నారు. తమను గోస పెట్టడం సర్కార్కు అంతమంచిది కాదని హెచ్చరిస్తున్నారు. కోతలు లేని విద్యుత్తును సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
కరెంట్ కోతలతో నీళ్లందక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ సర్కార్కు పట్టింపు లేకుండా పోయిందని రైతులు మండిపడుతున్నారు. అవసరమైనప్పుడు విద్యుత్తును అందించకపోతే ఇంకెప్పుడిస్తారని ప్రశ్నిస్తున్నారు. తమను గోస పెట్టడం సర్కార్కు అంతమంచిది కాదని హెచ్చరిస్తున్నారు. కోతలు లేని విద్యుత్తును సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నాగర్కర్నూల్, మెదక్, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం కురుమర్తిలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎండిన పంట పొలాలను పరిశీలించారు. అప్రకటిత విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్

అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్తు సంక్షోభం: గండ్ర
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్తు సంక్షోభానికి కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలే కారణమని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన భూపాలపల్లిలో మీడియాతో మాట్లాడారు. విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. జెన్కో, ట్రాన్స్కో, విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు, సింగరేణి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్లే విద్యుత్తు సంక్షోభం ఏర్పడిందని దుయ్యబట్టారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గడం, ఓవర్ బర్డెన్ (ఓబీ) టెండర్లలో రాజకీయ జోక్యం, కాంగ్రెస్ సర్కార్ చేసిన అవినీతి బొగ్గు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని విమర్శించారు. రాజకీయ కక్షలో భాగంగానే సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో మోటర్లు ఆన్ చేయడం లేదని మండిపడ్డారు.
ట్యాంకర్ నీరే ఆధారం
జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నీలహళ్లికి చెందిన రైతు జమ్మన్న రెండెకరాల పొలంలో వరి సాగు చేశాడు. పొలం పక్కనే గుడ్డెందొడ్డి రిజర్వాయర్ కాలువ ఉన్నా.. చుక్క నీరు అందడం లేదు. ఇక లోవోల్టేజీ సమస్యతో బోరు నడవడం లేదు. పంట ఎండుముఖం పట్టగా.. పొలం పగుళ్లు ఇచ్చింది. పంటను కాపాడుకోవాలని ఐదురోజులుగా రోజుకు 8 ట్యాంకర్ల నీటిని పారబెడుతున్నాడు.
సర్కార్ తీరు కారణంగా రైతులకు తిప్పలు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశాడు. – ధరూరు



Farmers

Farmers1

Farmers2

Farmers3
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

