అప్రెంటిస్‌షిప్ కోర్సులకు ఆదరణ అంతంతే.. ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సులు
అప్రెంటిస్‌షిప్ ఎంబీడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (ఏఈడీపీ) కోర్సులకు డిమాండ్ కనిపించడం లేదు. డిగ్రీ కాలేజీల్లోని ఈ కోర్సుల పట్ల విద్యార్థుల ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయింపు తర్వాత ఇదే విషయం వెల్లడయ్యింది. రాష్ట్రంలో 193 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 44 యూనివర్సిటీ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఏఈడీపీ కోర్సులు నిర్వహిస్తున్నారు.
- 60 కాలేజీల్లోని కోర్సుల్లో ఒక్కరూ చేరని వైనం
- ఒక్కరు చేరినవి 44 కాలేజీలు
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : అప్రెంటిస్‌షిప్ ఎంబీడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (ఏఈడీపీ) కోర్సులకు డిమాండ్ కనిపించడం లేదు. డిగ్రీ కాలేజీల్లోని ఈ కోర్సుల పట్ల విద్యార్థుల ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయింపు తర్వాత ఇదే విషయం వెల్లడయ్యింది. రాష్ట్రంలో 193 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 44 యూనివర్సిటీ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఏఈడీపీ కోర్సులు నిర్వహిస్తున్నారు. 60 కాలేజీల్లోని కోర్సుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా చేరలేదు. మరో 44 కాలేజీల్లోని కోర్సుల్లో ఒక్కరు మాత్రమే అడ్మిషన్ పొందారు. ప్రభుత్వ కాలేజీల్లో 11,580 ఏఈడీపీ కోర్సుల సీట్లుండగా, దోస్త్ మొదటి విడతలో 1,379 సీట్లు(11.91%) మాత్రమే భర్తీ అయ్యాయి. యూనివర్సిటీ, ప్రైవేట్ కాలేజీల్లో 2,610 సీట్లుంటే 218(8.35%) సీట్లు మాత్రమే నిండాయి. ఇక ఒక్కరు.. ఇద్దరు చేరిన వారు కూడా ఉండాలా? వద్దా? అన్న మీమాంసలో ఉన్నట్టు సమాచారం.
నో సెకండ్ లాంగ్వేజ్
ఏఈడీపీ కోర్సుల్లో సెకండ్ లాంగ్వేజ్‌ను ఎత్తివేశారు. దీనిని భాషాభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భాష లేకుండా కోర్సు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇవే కాకుండా మరికొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అవసరాలకు తగిన కరిక్యులం రూపకల్పన సమస్యగా ఉంది. ఫ్యాకల్టీ కొరత పట్టిపీడిస్తున్నది. ఇంజినీరింగ్, ఐటీ, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, మేనేజ్మెంట్ రంగాల్లో మాత్రమే అప్రెంటిస్‌షిప్ కల్పించడం సులభం. ఆర్ట్స్, హ్యుమానిటీస్ ప్యూర్ సైన్స్, సోషల్ సైన్స్ విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ కల్పించడం కష్టమవుతుందన్న వాదనలున్నాయి.
ప్రముఖ కాలేజీల్లో భళా
పేరొందిన కాలేజీల్లో ప్రవేశపెట్టిన ఏఈడీపీ కోర్సులకు మాత్రం తీవ్ర డిమాండ్ కనిపిస్తున్నది. హైదరాబాద్‌లోని సిటీ కాలేజీలో మూడు కోర్సుల్లో 60 సీట్ల చొప్పున 180 సీట్లుంటే మొత్తం భర్తీ అయ్యాయి. బీఏ యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్, బీకాం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, బీఎస్సీ లైఫ్ సైన్స్ కోర్సుల్లో వందశాతం సీట్లు, బీబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఆపరేషన్స్, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్ కోర్సుల్లో 60 సీట్లకు 42 నిండాయి. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో బీఎస్సీ ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సులో 30 సీట్లకు 30, నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ హెల్త్‌కేర్ కోర్సులో 60కి 58 సీట్లు, నిజాం కాలేజీలో బీబీఏ రిటైల్ ఆపరేషన్స్ కోర్సులో 60 సీట్లకు 60, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ కోర్సులో బీబీఏ లాజిస్టిక్స్ కోర్సులో 60 సీట్లకు 34 భర్తీ అయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

