హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ఈ నెల 7న నిర్వహించనున్న ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం నిర్వహించనున్న పరీక్షకు హైదరాబాద్ నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో 503, ఇతర పట్టణాల్లో 35 కలిపి మొత్తం 538 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 554 ఎస్సై పోస్టులకు 2,47,217 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలతో హాల్‌టికెట్ల డౌన్లోడ్ గడువు ముగిసింది.