కమాన్‌చౌరస్తా, జూలై 31: కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన రెండేండ్ల చిట్టుమల్ల అర్హయ ఉదయ చైతన్య ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. నగరానికి చెందిన చిట్టుమల్ల అడ్యుత్ చై తన్య, కన్నబోయిన ప్రశాంతి కూ తురు అర్హయ ఉదయ చైతన్య. ఈ పాప ఒకసారి చూసిన వస్తువు పేరు ఎప్పుడు అడిగినా చెప్తుంది. రెండు నిమిషాల్లోనే 60 బొమ్మల పేర్లు తడబడకుండా చెప్పేస్తుంది. ఇప్పటి వరకు 111 ఆర్ట్ ఫామ్స్ పూర్తి చేసి ఔరా అనిపించింది. 30 సెకండ్లలోనే తెలుగు, ఇంగ్లిష్ రైమ్స్ చెప్పేస్తుంది. చిన్నారి ప్రతిభకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. సూపర్ టాలెంటెడ్ కిడ్ అవార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ యంగెస్ట్ ఆర్ట్ ప్రొడిగీ అవార్డును అందించారు.