రేపు డెట్రాయిట్ పాతికేళ్ల పండుగ
డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి (డీటీఎల్సీ) ‘పాతికేళ్ల పండుగ’ రెండురోజులపాటు అట్టహాసంగా నిర్వహించనున్నట్టు డీటీఎల్సీ అధ్యక్షుడు పిన్నమనేని శ్రీనివాస్ తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి (డీటీఎల్సీ) ‘పాతికేళ్ల పండుగ’ రెండురోజులపాటు అట్టహాసంగా నిర్వహించనున్నట్టు డీటీఎల్సీ అధ్యక్షుడు పిన్నమనేని శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 30, అక్టోబర్ 1న ఫార్మింగ్టన్ నగరంలో సెయింట్ తోమా చర్చి ప్రాంగణంలో నిర్వహిస్తామని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర అమెరికాలోని అన్ని ప్రాంతాల నుంచి తెలుగు సాహిత్య అభిమానులు పెద్దఎత్తున తరలిరానున్నారని తెలిపారు. ప్రారంభ సభలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డీటీఏ) అధ్యక్షుడు దుగ్గిరాల కిరణ్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
‘అమెరికాలో తెలుగు భాష-భవిష్యత్తు కార్యాచరణ’ అనే అంశంపై కన్నెగంటి రామారావు ప్రసంగిస్తారని తెలిపారు. ‘ఈ మాట’ వెబ్ మ్యాగజీన్ పాతికేళ్ల పండుగ కూడా జరుపుకొంటున్నట్టు పేర్కొన్నారు. ఈ పండుగలో భాగంగా ‘ప్రవాస జీవితంలో తెలుగు సాహిత్యంతో అనుభవాలు’, ‘కొత్త తరానికి తెలుగు సాహిత్యంతో అనుబంధం పెంపొందించే అవకాశాలు’ అనే అంశాలపై చర్చిస్తామని తెలిపారు. ప్రముఖ అవధాని మేడసాని మోహన్ ‘ప్రబంధ కవులపై అన్నమయ్య ప్రభావం’ అనే అంశంపై ప్రసంగిస్తారని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

