హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 ( నమస్తే తెలంగాణ ) : ఈ నెల 24న కూడా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. హైదరాబాద్ (అమీర్ పేట్, బేగంపేట, టోలిచౌకీ), కరీంనగర్, నిజామాబాద్ కేంద్రాల్లో సేవలందిస్తామని చెప్పారు. దరఖాస్తుదారులందరూ www.passportindia.gov.in పోర్టల్ లేదా mPassportseva యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 23 వరకు అదనంగా 50 తత్కాల్ అపాయింట్మెంట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు.