10 రోజుల్లో దరఖాస్తుల పరిష్కారం
ధరణి పెండింగ్ ఫిర్యాదులను 10 రోజుల్లో పరిష్కరించాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.
- వీసీలో సీఎస్ శాంతికుమారి
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ధరణి పెండింగ్ ఫిర్యాదులను 10 రోజుల్లో పరిష్కరించాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలోని 25 వేల గ్రామ సమైక్య సంఘాలకు రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని సీఎం ఆదేశించారని గుర్తుచేశారు. వనమహోత్సవంలో భాగం గా 20.02 కోట్ల మొకలు నాటాలని తెలిపారు.
స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్య ంతో ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. ఇందిరమ్మ క్యాంటీన్ల ఏర్పాటుకు చొరవ చూపించాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు 2 వారాల్లో పూర్తికావాలని ఆదేశించారు. 50 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారని వీటికి సరిపడా యూరియా, ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగుల బదిలీలను ఈ నెల 20 లోగా పూర్తి చేయాలని తెలిపారు. ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు 20 ఎకరాల భూమిని సేకరించాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

