5ఏండ్లు కొనసాగితే శాశ్వత అటానమస్
కాలేజీలు, విద్యాసంస్థలు 15ఏండ్లపాటు అటానమస్ హోదాను దక్కించుకొంటే వాటికి శాశ్వత అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదాను కల్పిస్తారు. ఇందుకోసం సంబంధిత కాలేజీలు వ్యయప్రయాసలు పడాల్సిన పనిలేదు.
- స్వయంప్రతిపత్తి కాలేజీలకు మార్గదర్శకాలు జారీ
- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పోర్టల్లో దరఖాస్తుకు అవకాశం
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : కాలేజీలు, విద్యాసంస్థలు 15ఏండ్లపాటు అటానమస్ హోదాను దక్కించుకొంటే వాటికి శాశ్వత అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదాను కల్పిస్తారు. ఇందుకోసం సంబంధిత కాలేజీలు వ్యయప్రయాసలు పడాల్సిన పనిలేదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్వయం ప్రతిపత్తి హోదా కాలేజీలకు కొత్తగా మార్గదర్శకాలను రూపొందించింది. ఆయా మార్గదర్శకాలపై ఈ నెల 25లోపు ఈమెయిల్ ద్వారా సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపాలని కోరింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తామని తెలిపింది.
మార్గదర్శకాలివి..
- అటానమస్ హోదా కోసం కళాశాల, విద్యాసంస్థలు న్యాక్ ‘ఏ’ గ్రేడ్ లేదా కనీసం మూడు కోర్సులకు 675 స్కోర్తో ఎన్బీఏ గుర్తింపు పొంది ఉండాలి. మధ్యలోన్యాక్ ఏ గ్రేడ్ను కోల్పోయినా, ఎన్బీఏ స్కోర్ సాధించలేకపోయినా అటానమస్ హోదాను ఉపసంహరిస్తారు.
- అటానమస్ హోదాను తొలుత 10ఏండ్లకు జారీచేస్తారు. తర్వాత అంతా సవ్యంగా ఉంటే మరికొంత కాలం పొడిగిస్తారు.
- అటానమస్ హోదా కోసం అర్హత ఉన్న కాలేజీలు, వర్సిటీలు, విద్యాసంస్థలు సంవత్సరంలో ఎప్పుడైనా యూజీసీ దరఖాస్తు చేసుకోవచ్చు.
- కాలేజీలు అనుబంధ వర్సిటీలకు ప్రతిపాదనలివ్వగానే.. ఆయా వర్సిటీలు 30 రోజుల్లోపు యూజీసీకి దరఖాస్తులను సమర్పించాలి.
- వర్సిటీలు 30 రోజుల్లో యూజీసీ పోర్టల్లో స్పందించని పక్షంలో సంబంధిత కాలేజీకి అటానమస్ హోదా ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని భావిస్తారు.
- అటానమస్ హోదా ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయం యూజీసీ నియమించిన స్టాండింగ్ కమిటీయే తీసుకొంటున్నది.
- అటానమస్ కాలేజీల నిర్వహణ, పర్యవేక్షణ కోసం గవర్నింగ్ బాడీ, అకడమిక్ కౌన్సిల్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఫైనాన్స్ కమిటీలుంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

