మోదీని గద్దెదించే సత్తా కేసీఆర్‌కే ఉంది
ప్రధాని మోదీని గద్దె దించే సత్తా సీఎం కేసీఆర్‌కే ఉన్నదని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోతున్నదని, ఈ తరుణంలో దేశానికి కొత్త పార్టీ అవసరమని, అది కేసీఆర్ నాయకత్వంలోనే రావాలని ఎన్నారైలు బలంగా విశ్వసిస్తున్నారని చెప్పారు
టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీని గద్దె దించే సత్తా సీఎం కేసీఆర్‌కే ఉన్నదని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోతున్నదని, ఈ తరుణంలో దేశానికి కొత్త పార్టీ అవసరమని, అది కేసీఆర్ నాయకత్వంలోనే రావాలని ఎన్నారైలు బలంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. యూరప్ పర్యటనలో ఉన్న ఆయన ఆస్ట్రియాలో ఎన్నారైలతో సమావేశమయ్యారు.
సీఎం కేసీఆర్‌తో జూమ్ మీటింగ్ నిర్వహించాలని, జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ ఎజెండా.. ప్రజల ఎజెండాపై స్వయంగా ఆయనే దిశానిర్దేశం చేయాలని ఉత్తర భారత ఎన్నారైలు కోరుతున్నారని మహేశ్ వెల్లడించారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ క్రియాశీల పాత్ర పోషిస్తున్నదని, దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా ఉండాల్సిందేనని చెప్పారు. సీఎం కేసీఆర్ ముందుపెట్టిన ఎజెండాకు ఎన్నారైల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరించాలనే అభిప్రాయం ఎన్నారైల్లో ఉన్నదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఐటీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. సమావేశంలో టీఆర్ఎస్ ఆస్ట్రియా కార్యవర్గ సభ్యులు అనుమాండ్ల లక్ష్మారెడ్డి, బొల్లాడి లక్ష్మారెడ్డి, సంతోష్, కంది వంశీ, కోరండ్ల ప్రవీణ్, రంగు మహేశ్, దోర్నాల సంతోష్, శ్రీనివాసరావు, రమేశ్, అశోక్, భరత్, సత్యజిత్, రూపేశ్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

