హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): గతంలో ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలంటే తప్పనిసరిగా క్లాసుకు ప్రత్యక్షంగా వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు సాంకేతికత పుణ్యమా అని ఏ భాషనైనా ఆన్లైన్లో నేర్చుకునే అవకాశం దొరికింది. ఖర్చూ తక్కువే. ప్రాథమిక స్థాయిలో ఉచితంగా నేర్చుకోవ చ్చు. అందుకే, హైదరాబాద్ సహా దేశంలోని నగరా లు, పట్టణాల్లో కొత్త భాషను నేర్చుకోవడానికి 80 శాతం మంది ఆన్లైన్ వేదికనే ఎంచుకుంటున్నట్టు డ్యులింగో సంస్థ సర్వేలో వెల్లడైంది. కొత్త భాషను నేర్చుకోవడంలో సినిమాలు, ప్రత్యేక కార్యక్రమాలు దోహదపడుతున్నాయని 75% మంది అభిప్రాయపడ్డారు. వినడం, మాట్లాడడం ద్వారా కొత్త భాషను నేర్చుకోవచ్చని 83% మంది చెప్పారు. గతంలో లాగా క్లాసులకు వెళ్లి నేర్చుకోవడంపై అతి స్వల్పంగా ఆసక్తి చూపారని డ్యులింగో కంట్రీ మారెటింగ్ మేనేజర్ కరణదీప్ సింగ్ కపానీ పేర్కొన్నారు. పల్లెల్లోనూ ఎక్కువ మంది ఆన్లైన్లోనే కొత్త భాషలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.