మంకీపాక్స్ పాతదే
మంకీపాక్స్ వైరస్ పాతదేనని, ఇది అమ్మతల్లిగా పిలిచే చికెన్‌పాక్స్ కుటుంబానికి చెందినదని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు,
- పెద్ద ప్రమాదకరమేమీ కాదు
- వైద్యనిపుణుల స్పష్టీకరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): మంకీపాక్స్ వైరస్ పాతదేనని, ఇది అమ్మతల్లిగా పిలిచే చికెన్‌పాక్స్ కుటుంబానికి చెందినదని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, గాంధీ వైద్యకళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి తెలిపారు. మంత్రి హరీశ్‌రావు సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వారు మాట్లాడుతూ.. మంకీపాక్స్ వైరస్ పెద్ద ప్రమాదకారి ఏమీ కాదని, దీని బారిన పడినవారికి ప్రత్యేక చికిత్స ఏమీ లేదని, కేవలం సింప్టమాటిక్ ట్రీట్మెంట్, సపోర్టింగ్ ట్రీట్మెంట్, యాంటి వైరల్ ఔషధాలు సరిపోతాయని వివరించారు. అవసరమైతే ఐవీ ఇవ్వచ్చని చెప్పారు. ఈ వ్యాధి బారిన పడినవారు తుమ్మినా, దగ్గినా వైరస్ వ్యాపిస్తుందని, వారిని తాకినవారికి కూడా వైరస్ ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించే సమయంలో పీపీఈ కిట్లు, గ్లౌజ్‌లు, మాస్క్‌లు వినియోగించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Monkeypox
- monkeypox virus
RELATED ARTICLES
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

