పెద్దపల్లి : సేవాతత్పరతకు నిలువెత్తు నిదర్శనం.. యువత భవిష్యత్తుకు ‘తారక’మంత్రం.. నేటి రాజకీయాల్లో పర్ఫెక్ట్ లీడ కేటీఆర్ జన్మదిన వేడుకలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు దేశ, విదేశాల్లో ఘనంగా జరపుకుంటున్నారు. అయితే ప్రముఖులు, ముఖ్య నాయకుల జన్మదిన వేడుకలంటే సహజంగా అట్టహాసంగా జరుపుకొంటారు.
కానీ, మంత్రి కేటీఆర్ మాత్రం అందుకు విభిన్నం. ప్రచార ఆర్భాటాలకయ్యే ఖర్చులు అభాగ్యులు, అసహాయులు, నిరుపేదల అభ్యున్నతి కోసం వెచ్చించాలని కార్యకర్తలకు తరుచూ చెప్తుంటారు. ఒకసారి తన బర్త్‌డేకి మొక్కలను నాటాలని, మరోసారి ‘గిఫ్ట్ ఏ స్మైల్’కు పిలుపునిస్తారు. కేటీఆర్ పిలుపు మేరకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మానవీయంగా స్పందించారు.
మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గిప్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఓ నిరుపేదరాలికి ఇళ్లు కట్టి గిఫ్ట్ గా అందించారు. సోమవారం అంతర్గాం మండలం గోలివాడ గ్రామంలో నూతన ఇల్లును పేద ఓంటరి మహిళ గాదెం రాజమ్మకు అందించడంతో పలువురు ఎమ్మెల్యే పనితీరుపై ప్రశంసలు కురిపించారు.